Share News

మైనార్టీల సంక్షేమమే కూటమి ధ్యేయం

ABN , Publish Date - Aug 15 , 2026 | 12:20 AM

ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

మైనార్టీల సంక్షేమమే కూటమి ధ్యేయం
ముస్లింలకు పట్టా అందజేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఓర్వక ల్లులో ఎమ్మెల్యే సహకారంతో 532/సీ సర్వే నెంబరులో 36 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని షాదీఖానా నిర్మాణానికి సంబంధించిన పట్టాను తహసీల్దార్‌ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు నగరంలోని మాధవీనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి ఓర్వకల్లు ముస్లింలకు అందజేశారు. ఈ సందర్భంగా ముస్లింలు ఎమ్మెల్యే గౌరు దంపతులను సన్మానించారు. తహసీల్దార్‌ విద్యాసాగర్‌, సర్వేయర్‌ శంకర్‌ మాణిక్యం, వీఆర్వో స్వామన్న, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ నాగిరెడ్డి, నాయకులు రాంభూపాల్‌ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, ముస్లింలు అయూబ్‌బాషా, అన్వర్‌బాషా, మస్తాన, బషీర్‌, ఇబ్రహీం, ఫిరోజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 12:20 AM