రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:36 PM
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమేనని రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల రూరల్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమేనని రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. గురువారం నంద్యాల మార్కెట్ యార్డులో చైౖర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ టెక్కె మార్కెట్ యార్డులో 25 దుకాణాలకు మరమ్మతులతో పాటు కార్యాలయ భవనం, ప్రహరీ, జీబీ షీట్స్ నిర్మాణం పనులు చేపట్టార న్నారు. నంద్యాల మార్కెట్‌కు రూ.1.51కోట్లు సీఎం చంద్రబాబునాయుడు నిధులు వి డుదల చేశారన్నారు. గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ రైతుల అవసరాల మేరకు మార్కెట్ యార్డులో అన్నివసతులు సమకూరుస్తామన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్, కమిటీ వైస్ ఛైర్మన్ రంగప్రసాద్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.