రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:44 AM
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి
గూడూరు మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. మంగళ వారం గూడూరులో నిర్వహించిన ‘రైతన్న మీ కోసం’ లో భాగంగా ఇంటింటికి వెళ్ళి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన పథకం అమలుకు సంబంధించిన కర పత్రాలను రైతులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్నకు వ్యవ సాయ పెట్టుబడుల కోసం నేరుగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన పథకం నిధు లను జమ చేశారన్నారు. 2025-26 సంవత్సరా నికి గాను కోడుమూరు నియోజకవర్గంలో ప్రతి విడతలో 35,052 మంది రైతులకు రూ.19.72 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. కార్యక్ర మంలో ఏవో దస్తగిరి రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కె రామాంజనేయులు, సింగిల్‌విండో డైరెక్టర్ రేమట వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కోడుమూరు షాషా వలి, నాగప్పయాదవ్, పౌలు, మన్సుర్, వీరకుమార్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.