రైతుల సంక్షేమమే కూటమి ధ్యేయం
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:15 AM
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
రాజముద్రతో కూడిన పాసు పుస్తకాల పంపిణీ
ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు రూరల్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. బుధవారం ఎర్రదొడ్డి గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను రైతులకు అందిస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన తన బొమ్మను ముద్రించి రైతులను మోసం చేశారన్నారు. గత తప్పిదాలు లేకుండా రైతుల ఆస్తికి పూర్తి భద్రత కల్పిస్తూ సీఎం చంద్రబాబు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలు పంపిణీకి శ్రీకారం చుట్టారని సంతోషం వ్యక్తం చేశారు. తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ 4,600 ఎకరాలకు సంబంధించి 1,526 పాసు పుస్తకాలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో డీటీ కృష్ణమూర్తి ఆర్‌ఐ అశోక్, సీనియర్ అసిస్టెంట్ విష్ణుయాదవ్, వీఆర్వో నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శి మాధవి పాల్గొన్నారు.