Share News

వైభవంగా.. లలితా సుందరేశ్వర కల్యాణం

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:12 AM

కార్తీకమాస శుక్రవారం సందర్భంగా పాతనగరంలో జమ్మిచెట్టు సమీపంలోని శ్రీలలితా పీఠంలో లలితా సుందరేశ్వర స్వామి అమ్మవార్ల కల్యాణం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా.. లలితా సుందరేశ్వర కల్యాణం
స్వామి, అమ్మవార్లకు కల్యాణం నిర్వహిస్తున్న మాధవశర్మ

కర్నూలు కల్చరల్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కార్తీకమాస శుక్రవారం సందర్భంగా పాతనగరంలో జమ్మిచెట్టు సమీపంలోని శ్రీలలితా పీఠంలో లలితా సుందరేశ్వర స్వామి అమ్మవార్ల కల్యాణం వైభవంగా నిర్వహించారు. శాస్త్ర పండితుడు మాధవ శర్మ నేతృత్వం లో జరిగిన ఈ కల్యాణంలో స్థానిక భక్తులతోపాటూ వివిధ ప్రాం తాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అంతకు ముందు ఆలయంలో వెలసిన వేంకటేశ్వర స్వామి వారి మూల మూర్తికి పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిక రమైన మాసమని, శుక్రవారం వైష్ణవ రూపుడైన వేంక టేశ్వర స్వామికి, శివ స్వరూపుడైన లలితా సుందరేశ్వర స్వామి వార్లకు పూజలు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా రాత్రి జ్వాలా తోరణం కన్నుల పండువగా నిర్వహించారు.

Updated Date - Nov 21 , 2026 | 12:12 AM