శ్రమకు విలువ పెరగాలి
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:33 PM
శ్రమజీవులు చేసే శ్రమకు విలువ పెరగాలని ప్రజాకవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు,
ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నంద్యాల రూరల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): శ్రమజీవులు చేసే శ్రమకు విలువ పెరగాలని ప్రజాకవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు, గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాస భలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని సూరజ్ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలో సామాజిక తత్వవేత్త వీరబ్రహ్మం, కబీర్‌దాస్ లాంటి వ్యక్తులు కూడా తత్వబోధనలు చేసినప్పటికీ శ్రమను నమ్ముకున్నారని అభివర్ణించారు. నేడు విలువలు కనుమరు గౌతున్నాయన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావ్ మాట్లాడుతూ దేశంలో కార్మిక హక్కు లపై ఎన్నడూ లేని విధంగా దాడులు జరుగుతున్నాయన్నారు. కార్మిక హక్కులు, చట్టాల ను కాలరాస్తున్నారని ఆరోపించారు, కార్మికుల తిరుగుబాట్లు తప్పవని హెచ్చరించారు. సీఇటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేవ్వరరావు, ఉపాధ్యక్షుడు మరళి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.