సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి
ABN , Publish Date - May 08 , 2026 | 12:00 AM
రైతులు సేంద్రియ, జీవ ఎరువుల వాడకం పెంచాలని కేంద్ర బృందం సభ్యులు డిఫ్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్, ప్రొఫెసర్ మధు శేఖర్ సూచించారు.
కేంద్ర బృందం సభ్యులు
బండిఆత్మకూరు, మే7(ఆంధ్రజ్యోతి): రైతులు సేంద్రియ, జీవ ఎరువుల వాడకం పెంచాలని కేంద్ర బృందం సభ్యులు డిఫ్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్, ప్రొఫెసర్ మధు శేఖర్ సూచించారు. గురువారం మండలంలోని బీ కోడూరు గ్రామ సచివాలయంలో రైతులతో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఏఏ మందులు ఎంతెంత మోతాదులో వినియోగిస్తున్నారు? దిగుబడి, గిట్టుబాటు ధర ఎలా ఉన్నాయి? అనే విషయాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మోతాదుకు మించి రసాయనిక, క్రిమి సంహారక మందులను వాడకం వల్ల భూసారం ఏటేటా క్షీణిస్తుందని, జీవ ఎరువులు నానో యూరియా, డీఏపీలను వినియోగించుకోవాలని సూచించారు. ఏవో పవన్‌కుమార్, ఎంపీఈవో లక్ష్మయ్య, వీఏఏ సుహాసిని పాల్గొన్నారు.