ఐక్య ఉద్యమం ఉధృతం కావాలి
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:12 AM
రాయల సీమ రైతులు పాలకులపై ఒత్తిడి పెంచేందుకు ఐక్య ఉద్యమం ఉధృతం కావాలని మాజీమంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, రాయ లసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరధ రామిరెడ్డి పిలుపునిచ్చారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల ఎడ్యుకేషన్, మే 31 (ఆంధ్రజ్యోతి): రాయల సీమ రైతులు పాలకులపై ఒత్తిడి పెంచేందుకు ఐక్య ఉద్యమం ఉధృతం కావాలని మాజీమంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు, రాయ లసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరధ రామిరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఏఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన పదవ వార్షికో త్సవ మహాసభ ఘనంగా నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ మహాసభలో వడ్డే శోభనాధ్రీశ్వరరావుతో పాటు ఏపీ రైతు కూలీ సంఘం అధ్యక్షు రాలు ఝాన్సీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫె సర్ వెంక టేష్ ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. వక్తలు మాట్లా డుతూ దివంగత నందమూరి తారక రామారావు చేపట్టిన రాయ లసీమ సాగునీటి ప్రాజెక్టులు 40యేళ్లు గడిచినా ఇంకా పూర్తికా కపోవడం బాధగా ఉందన్నారు. గోదావరి నీటిని బనకచర్లలో పోయడం కన్నా శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని దిగువకు వదలకుండా రాయలసీమ ప్రాజెక్టులకు కేటా యిస్తే వలసలు, కరువు పోతుందన్నారు. ఆగస్టు 1న రాయలసీమ వ్యాప్తంగా కలె క్టరేట్‌ల ముట్టడి చేపట్టాలన్న ప్రజా సంకల్పానికి తమ మద్దతు ఉంటుందన్నారు. మహాసభలో విరసం వరలక్ష్మీ, డాక్టర్ నాగన్న, డాక్టర్ బ్రహ్మారెడ్డి, సహదేవరెడ్డి, రమణ, సీపీఐ నాయకులు రా మాంజనేయులు, సీపీఐఎం నాయకులు రాజశేఖర్ పాల్గొన్నారు.