Share News

ముచ్చటగా మూడోసారి..!

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:01 AM

రైతుల కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం నూతన ఆశలను నింపుతోంది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా ఇస్తోంది. గ్రామీణ వ్యవసాయరంగానికి వెన్నుగా నిలుస్తోంది.

ముచ్చటగా మూడోసారి..!

నేడు రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్‌ నిధులు

జిల్లా వ్యాప్తంగా రూ.119.91 కోట్ల నగదు జమ

2,06,052 మందికి లబ్ధి

1,87,450 మంది పీఎం కిసాన్‌ లబ్ధిదారులు

రైతుల కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం నూతన ఆశలను నింపుతోంది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా ఇస్తోంది. గ్రామీణ వ్యవసాయరంగానికి వెన్నుగా నిలుస్తోంది. రబీ పంట చేతికొస్తున్న సమయంలో అయ్యే నూర్పిడి ఖర్చులకు, భూమి చదునుకు ఈ ఆర్థిక భరోసా అండగా ఉంటోంది. మూడో విడత నగదును శుక్రవారం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అధికార లెక్కల ప్రకారం.. జిల్లాలోని 3,93,502 మంది రైతులకు రూ.400 కోట్లు జమ చేయనుంది. ఇది రైతుల్లో ఆనందోత్సాహాలను నింపనుంది. జిల్లాలోని ఏడు నియోజక వర్గాల్లో ఈ కార్యక్రమం సందడిగా నిర్వహించనున్నారు.

నంద్యాల, మార్చి12(ఆంధ్రజ్యోతి)

అధికారిక లెక్కల ప్రకారం..

అధికార లెక్కల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ కింద జిల్లాలో 1,87,450మంది రైతులకు.. అన్నదాత సుఖీభవ కింద 2,06,052 మందిని జిల్లా అధికార యం త్రాంగం అర్హులుగా గుర్తించింది. వీరికి శుక్రవారం రూ.119.91కోట్ల నగదు ఆయా రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఆళ్లగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరు నియోజక వర్గాల పరిధిలో ఎక్కువ మంది రైతులకు సదరు పథకాల కింద లబ్ధి చేకూరుతున్నట్లైంది.

కౌలు రైతులకు నిరాశే

జిల్లాలోని కౌలు రైతులకు మాత్రం నిరాశ తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సా యం అందిస్తామని ప్రకటించింది. కానీ వివిధ కారణాల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవ్వలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం పీఎం కిసాన్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. వచ్చే ఆర్థిక సంవ త్సరంలోనైనా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చేరా? అనే అభిప్రాయం కౌలురైతుల్లో నెలకొంది. జిల్లాలో సుమారు 50 వేల మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది.

జిల్లాలో పరిస్థితి ఇలా...

అన్నదాత సుఖీభవ

పొందే రైతులు : 2,06,052

పీఎం కిసాన్‌

లబ్ధిదారులు : 1,87,450

అన్నదాత సుఖీభవ

నిధులు : రూ.82.42 కోట్లు

పీఎం కిసాన్‌

నిధులు : రూ.37.49 కోట్లు

రెండు పథకాలకూ

అందే నగదు : రూ. 119.91 కోట్లు

మూడు విడతల్లో

మొత్తం లబ్ధి : రూ. 400.02 కోట్లు

నియోజకవర్గాల వారీగా లబ్ధిదారులు

నియోజకవర్గం అన్నదాత పీఎం కిసాన్‌

సుఖీభవ

నంద్యాల 12,953 12,022

నందికొట్కూరు 36,734 33,775

శ్రీశైలం 25,018 23,063

డోన్‌ 35,011 30,848

పాణ్యం 12,691 12,242

ఆళ్లగడ్డ 42,981 39,416

బనగానపల్లె 40,664 36,084

మొత్తం 2,06,052 1,87,450

రైతులకు అండగా ప్రభుత్వాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పథకాల పరంగా రైతులకు రూ. 20 వేలు అందించడం శుభపరిణామం. పేద రైతులకు ప్రభుత్వాలు అండగా ఉన్నాయి.

జిల్లా వ్యవసాయాధికారి, వెంకటేశ్వర్లు, నంద్యాల.

మూడో విడతలో రూ. 119.91 కోట్లు..

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ మూడో విడత కింద అర్హులైన రైతులకు జిల్లా వ్యాప్తంగా రూ.119.91 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో నేడు జమ కానుంది. ఈ సాయం రైతులకు ఎంతో ప్రయోజనం.

రాజకుమారి, కలెక్టర్‌, నంద్యాల

Updated Date - Mar 13 , 2026 | 12:01 AM