Share News

ముగిసిన ‘పది’ పరీక్షలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:33 PM

మార్చి 16వ తేదీ నుంచి మొదలైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు గురువారం ముగిశాయి. కర్నూలు జిల్లాలో రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు మొత్తం 35,791 మంది పరీక్షలకు నమోదు చేసుకున్నారు.

ముగిసిన ‘పది’ పరీక్షలు

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మార్చి 16వ తేదీ నుంచి మొదలైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు గురువారం ముగిశాయి. కర్నూలు జిల్లాలో రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు మొత్తం 35,791 మంది పరీక్షలకు నమోదు చేసుకున్నారు. ఇందులో రెగ్యులర్‌ 33,796 మంది, ప్రైవేటు విద్యార్థులు 1975 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 160 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెగ్యులర్‌ పరీక్షలతో పాటు ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పరీక్షలు కూడా జరి గాయి. జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్‌ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. గురువారం జరిగిన ఇంగ్లీషు పరీక్షకు జిల్లాలో రెగ్యులర్‌, ప్రైవేటు మొత్తం విద్యార్థులు 34,301 మందికి గాను 33,792 మంది హాజరు కాగా 509 మంది గైర్హాజరయ్యారని డీఈవో సుధాకర్‌ తెలిపారు. జిల్లాలో డీఈవో 5 పరీక్ష కేంద్రాలను, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఫర్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారి గోవిందునాయక్‌ 3 పరీక్ష కేంద్రాలను, ప్లయింగ్‌ స్క్వాడ్‌ 53, సిట్టింగ్‌ స్క్వాడ్‌ 13 పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు. మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని డీఈవో తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 11:33 PM