Share News

టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ

ABN , Publish Date - Nov 27 , 2026 | 11:03 PM

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు.

టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ
మాట్లాడుతున్న ఫిరోజ్‌

ప్రజాస్వామాన్ని కాపాడడమే ప్రభుత్వ ధ్యేయం

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌

నంద్యాల రూరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామాన్ని కాపాడడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలపై మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మండి పడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఓపిక పట్టామని నేడు వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నామ న్నారు. 2024 ఎన్నికల్లో డబ్బు ఉందన్న అహంకారంతో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు గుర్తులేవా అని ప్రశ్నించారు. ఆ అహంకారమే నేడు వారి పతనానికి నాందిగా నిలిచిందన్నారు. 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 12 మంది టీడీపీ వార్డు సభ్యులను బెదిరించి ఏకగ్రీవం చేసుకున్న చరిత్ర శిల్పాదేనన్నారు. తాము కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేశామనడం సబబు కాదన్నారు. గోస్పాడు మండలంలో 10 మంది టీడీపీ మద్దతుదారులు విజయం సాదించడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుబ్రమణ్యం, కౌన్సిలర్లు షాకీర్‌, అక్బర్‌, ప్రదీ్‌పరెడ్డి, గఫార్‌, పద్మశేఖర్‌, రామయ్య పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 11:03 PM