Share News

పర్యావరణ పరిరక్షణతోనే మానవుని మనుగడ

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:12 AM

knl news

పర్యావరణ పరిరక్షణతోనే మానవుని మనుగడ
మాట్లాడుతున్న లీలా వెంకటశేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార

సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి

ఆత్మకూరురూరల్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరిరక్షణతోనే మానవుని మనుగడ సాధ్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. మంగళవారం మండలంలోని సంజీవనగర్‌ తండా గ్రామంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా అధికారుల సమన్వయంతో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అటవీ సమీప గ్రామాల్లో వణ్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు, పంటలు, పశువులను కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం నుండి పరిహారం పొందే హక్కు ఉందన్నారు. గిరిజనులకు ఏమైనా సమస్యలు ఉంటే లీగల్‌ సర్వీససెస్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 15100కు ఫోన్‌చేసి ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చని తెలిపారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరామ చంద్రరావు మాట్లాడుతూ.. వణ్యప్రాణుల బాధితులు పరిహారం కోసం అటవీ శాఖ అధికారులకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ గుండాల నాయక్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం వణ్యప్రాణుల దాడిలో గాయపడ్డ బాధితులకు తక్షణ సహాయం కోసం 2026లో ప్రాజెక్ట్‌ హనుమాన్‌ను ప్రారంభించిందని తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్‌ మాట్లాడుతూ అటవీ జంతువులను కాపాడుకోవడం ద్వారా జీవ వైవిఽధ్యానికి తోడ్పాటు అందించవచ్చన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి గిరిజనులకు చికిత్సలు అందించారు. కార్యక్రమంలో రేంజర్లు లక్ష్మికుమారి, జాకీర్‌హుపసేన్‌, ఎంపీడీవో నాగేంద్రుడు, ఆత్మకూరు న్యాయవాదులు భాస్కర్‌, బతుకులయ్య, అంకిరాజు,సర్పంచ్‌ నాగులు నాయక్‌, వైద్యాధికారి పవన్‌కుమార్‌ ఐటిడిఏ అధికారులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.

Updated Date - Jul 29 , 2026 | 12:12 AM