సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:07 AM
విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం తప్పదని డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు అన్నారు.
డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు
కర్నూలు అర్బన, జూలై 16(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం తప్పదని డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి విద్యార్థి, యువజన సంఘాలు, విద్యావేత్తలు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొని అభిప్రాయాలు, సూచనలు తెలిపారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయుల ఖాళీలు, స్కాలర్ షిప్‌లు, ఫీజ్ రీయంబర్స్ మెంట్ అలస్యం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, హస్టల్ సమస్యలు, నిరుద్యోగం, నైపుణ్యాభివృద్ది, క్యాంపస్ ప్లేస్ మెంట్లు, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, గ్రామీణ విద్యార్థుల సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలోని అంశాలు, సూచ నలను కలెక్టర్, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, గరవ్నర్‌లకు వినతి పత్రాలుగా నివేదించాలని తీర్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి వెంక టన్న, ఏఐవైఎఫ్ జిల్లా సెక్రటరీ కే.శ్రీనివాసులు, ఎనపీఎస్‌ఎఫ్ అధ్య క్షుడు ఎం. రాజన్న, పగడాల ఆనందబాబు, సీమకృష్ణ, వి. భరత కు మార్, ఎస్ షబ్బీర్ బాషా, బతుకన్న, ఎన్సీ బజారన్న, కాంగ్రెస్ నాయ కులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.