Share News

ధరలు తగ్గించే దాకా పోరాటం

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:28 PM

రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఎండి. అంజిబాబు అన్నారు.

ధరలు తగ్గించే దాకా పోరాటం
కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న అంజిబాబు

పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ఽధరలు పెంచడం దారుణం

సీఐటీయూ జిల్లా కార్యదర్శి అంజిబాబు

కర్నూలు న్యూసిటీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఎండి. అంజిబాబు అన్నారు. రవాణ రంగ కార్మికు లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించా లని కోరుతూ ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్టు ఫెడరేషన్‌, ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్వర్యంలో ఆల్‌ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ రవాణా రంగం నుంచి లబ్ధి పొందుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకో వడం లేదని విమర్శించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను సాకుగా చూపుతూ పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలను పెంచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌. రాధాక్రిష్ణ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మాజీ రాష్ట్ర కోశాధికారి జే. దివాకర్‌, యూనియన్‌ న్యూసిటీ ప్రధాన కార్యదర్శి బి. రాధాక్రిష్ణ, ఆటో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి మహమూద్‌, కే. ప్రభాకర్‌, నరసింహులు, పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:28 PM