రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:27 AM
ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభలు, రాష్ట్ర వీధి నాటకోత్సవాలను జయప్రదం చేయాలని ఆ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు.
ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్
కర్నూలు న్యూసిటీ/ కల్చరల్, జూలై 24(ఆంధ్రజ్యోతి): ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభలు, రాష్ట్ర వీధి నాటకోత్సవాలను జయప్రదం చేయాలని ఆ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కేకే భవనలో మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. కర్నూలు నగరంలో ఈనెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మొదటిసారి నిర్వహిస్తున్న రాష్ట్ర వీధి నాటకోత్సవాలు, రాష్ట్ర 11వ మహాసభలను జయప్రదం చేయాలన్నారు. జూలై 25న సన్యాసిరావు నగర్ పెంచలయ్య ప్రాంగణంలో లక్ష్మీనారాయణ, కాశీ విశ్వనాథ్ అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, ప్రారంభ సభ ఉంటుందన్నారు. ప్రారంభ సభకు ముఖ్యఅతిథులుగా అంకురం సినిమా దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ప్రముఖ కవి, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, ఆహ్వన సంఘం అధ్యక్షుడు జి.పుల్లయ్య, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు కేవీ.సుబ్బారెడ్డి, ప్రముఖ సినీ నటులు విజయలక్ష్మి హాజరవుతారన్నారు. సాయంత్ర 4 గంటలకు కళాకారుల ర్యాలీ వై.జంక్షన నుంచి మార్కెట్ యార్డు వరకు ఉంటుందని, అనంతరం గాదే సుబ్బారెడ్డి ప్రాంగణంలో సప్టర్ హస్మీ థియేటర్లో వీధి నాటకోత్సవాలు జరుగుతాయన్నారు.