Share News

రెండేళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షం

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:10 AM

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని, రెండేళ్ల పరిపాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

రెండేళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షం
పూడిచర్లలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతుందని, రెండేళ్ల పరిపాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కేతవరం పూడిచెర్ల గ్రామాల్లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొని కరపత్రాలు పంపిణీ చేసి సంక్షేమం, అభి వృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. కేతవరం గ్రామంలో ఎనఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.10లక్షలు, పూడి చెర్ల గ్రామంలో ఎనఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.15 లక్షలతో, నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆమె మాట్లాడు తూ ఓర్వకల్లు మండలాన్ని ఇండస్ర్టియల్‌ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. టీడీపీ నాయకుడు పుల్లారెడ్డి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో కాలికి గాయం కావడంతో ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్‌ బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, ఎంపీడీవో నాగ అనుసూయ, డిప్యూటీ ఎంపీడీవో శాంతయ్య, పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ సురేంద్రనాథ్‌ రెడ్డి, ఎస్‌ఐ సునీల్‌ కుమార్‌, ఎంఈవో ఓంకార్‌ యాదవ్‌, ఏవో మధుమతి, నాయకు లు చంద్రపెద్దస్వామి, ఆకుల మహేష్‌, బాలిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, పుల్లారెడ్డి, తిరుపాలు, ప్రకాశం, శివుడు, రాజన్న పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:10 AM