సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారు
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:05 AM
ఆర్టీసీ సిబ్బంది అంకింతభావంతో పనిచేస్తున్నారని ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ.నరసయ్య అన్నారు.
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ.నరసయ్య
కర్నూలు రూరల్ ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సిబ్బంది అంకింతభావంతో పనిచేస్తున్నారని ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ.నరసయ్య అన్నారు. కర్నూలులో ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నిర్మాణ మహాసభ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శి రంగస్వామి, ఏవీరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య పాల్గొని ప్రసంగించారు. అరకొర పాతబస్సులతో అధిక పనిభారంతో పని ఒత్తిడిలో కూడా సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. ప్రస్తుత పరిస్థితిలో కనీసం 3వేల కొత్తబస్సులను కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా స్రీ-శక్తి పథకాన్ని విజయ వంతం చేయడంలో సిబ్బంది మెరుగ్గా పనిచేశారన్నారు. రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, పీఏ.మజిద్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డీఏ, 11వ పీఆర్‌సీ బకాయిలను ప్రభుత్వంతక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జోనల్ కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ జనవరి లోపు అన్ని క్యాటగిరిలో పదోన్న తులు పూర్తి చేయాలని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేసినా కడప జోనల్ లో మాత్రం పదోన్నతులు ఆగిపోయాయన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ కర్నూలు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయూ నాయకులు రాముడు, ఎస్‌ఏ.భాష, పికెరెడ్డి,ముత్యాలరెడ్డి, రబ్బాని, రాజు, మహేశ్వరరావు పాల్గొన్నారు.