శ్రీశైలం ప్రాజెక్టు దేశానికే తలమానికం
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:56 PM
శ్రీశైలం ప్రాజెక్టు దేశానికే తలమానికంగా నిలుస్తూ వరల్డ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్ వంటి అరుదైన గౌరవం కలిగిన అవార్డును కైవసం చేసుకోవడం గర్వకారణమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం గర్వకారణం
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ప్రాజెక్టు దేశానికే తలమానికంగా నిలుస్తూ వరల్డ్ బుక్‌ఆఫ్ రికార్డ్స్ వంటి అరుదైన గౌరవం కలిగిన అవార్డును కైవసం చేసుకోవడం గర్వకారణమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. దక్షిణ ఆసియా ఖండంలోనే ప్రత్యేకత కలిగిన భారీ ఆనకట్టగా గుర్తింపు లభించిన సందర్భంగా సోమవారం సున్నిపెంటలోని జెన్‌కో అతిథిగృహంలో లండన్ డబ్ల్యూబీఆర్ సౌత్ రీజన్ జాయింట్ సెక్రటరీ ఇలియాజర్ నుంచి ఎమ్మె ల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అవార్డును అందుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శతాబ్దాల చరిత్ర కలిగి జ్యోతిర్లంగ శక్తిపీఠమై విరాజిల్లుతున్న పు రాతన దేవాలయంతో పాటు భావితరాలకు ఉపయోగపడేలా నిర్మించిన ఆధునిక దేవాలయం(శ్రీశైలం ప్రాజెక్టు) ఒకే ప్రాంతంలో కలిగి ఉండటం విశేషమన్నారు. సముద్రమట్టానికి 980అడుగుల ఎత్తులో ఉండి సుమారు 70 ఏళ్లుగా ప్రణాళికాబద్ధమైన నిర్వహణతో ఇప్పటికీ విజయవంతంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు విద్యుత్తు, వ్యవసాయ, తాగు నీటిని అందిస్తూ కీర్తిప్రతిష్టలు కలిగి ఉండటం గమనార్హమన్నారు. టీడీపీ శ్రీశైలం ఇన్‌చార్జి యుగంధర్ రెడ్డి, ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈ వేణుగోపాల్ రెడ్డి, ఈఈ రవికుమార్, డీఈ గోపాల్‌నాయక్, జెన్కో సీఈ ము రళీకృష్ణ, ఈఈ సుధాకర్, డీఈఈ రామసుబ్బారెడ్డి, తహసీల్దార్ కిషోర్, ఏఈలు, సీఐ సుబ్బారావు పాల్గొన్నారు.
ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని..
1960లో శంకుస్థాపన చేసిన నాటినుంచి ఆనకట్ట నిర్మాణానికి పాటుపడిన ఇంజనీరింగ్, మెకానికల్, అడ్మినిస్ట్రేషన్ వంటి శాఖల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బం ది కృషిని, త్యాగాలను గుర్తిస్తూ అభినందనలు తెలిపారు. నేడు అందుకున్న అవార్డులో వారినికూడా భాగస్వాములను చేస్తూ ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని త్వరలో ఏర్పాటు చేస్తానని ఎమ్యేల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆనకట్ట నిర్వహణకు అహర్నిశలు శ్రమిస్తున్న ఇరిగేషన్, జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించినట్లు తెలిపారు.