Share News

శ్రీగిరిపై కార్తిక శోభ

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:08 AM

శ్రీగిరిపై కార్తిక శోభ

శ్రీగిరిపై కార్తిక శోభ
దర్శనాల కోసం కంపార్టుమెంట్‌లో వేచి ఉన్న భక్తులు

క్షేత్ర వీఽధుల్లో కిటకిటలాడుతున్న యాత్రికులు

ఉభయ దేవాలయాల్లో భక్తులందరికీ అలంకార దర్శనమే

శ్రీశైలం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకుని కార్తిక దీపాలు వెలిగించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆదివారం క్షేత్ర పరిధిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చిన యాత్రికులతో శ్రీగిరిలోని వసతి సముదాయాలు కిటకిటలాడాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు దర్శన సదుపాయాల్లో ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్వామి, అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో అందరికీ అలంకార దర్శనం మాత్రమే ఉన్నందున దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం మాత్రమే పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ గంగాధర మండపం వద్ద, శివాజీ గోపురం మాడవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉసిరి చెట్ల కింద భక్తులు దీపాలు వెలిగించారు. సాయంత్రం భ్రమారాంబదేవికి పల్లకిసేవను ఘనంగా నిర్వహించారు.

నేడు లక్ష దీపోత్సవం, పుష్కరిణికి హారతులు

కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు తెలిపారు. సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతుల కార్యక్రమాన్ని జరిపించనున్నట్లు తెలిపారు.

Updated Date - Nov 30 , 2026 | 12:08 AM