Share News

కార్తీక శోభ

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:15 AM

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని శివకేశవ, వివిధ ఆలయాలు, ధార్మిక క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.

కార్తీక శోభ
వినాయకఘాట్‌లో జ్వాలాతోరణాన్ని వెలిగిస్తున్న భక్తులు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

సామూహిక దీపారాధనలు

వివిధ చోట్ల జ్వాలా తోరణాలు.. ఆకాశ దీపాలు

కర్నూలు కల్చరల్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం నగరంలోని శివకేశవ, వివిధ ఆలయాలు, ధార్మిక క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మంగళవారం సాయంత్రం పౌర్ణమిరాకతో వందలాదిగా మహిళా భక్తులు తమతమ సమీప ఆల యాల్లో పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసం నోములు, ఉపవాసాలు పాటిస్తూ పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద దామోదర పూజలు, తులసి కోటల వద్ద దీపారాధనలు చేపట్టారు. సాయంత్రం సామూహికంగా విచ్చేసి దీపోత్సవాలు చేపట్టారు. నగరంలోని కేసీ కెనాల్‌ ఒడ్డునగల వినాయక ఘాట్‌తోపాటు, సమీపంలోని సత్యనారాయణ స్వా మి ఆలయంలో దీపాలు వెలిగించి దీపలక్ష్మికి స్వాగతం పలికారు.

కాషాయ పతకాలను..

కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ వద్ద జిల్లా యంత్రాంగం, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఘాట్‌కు ఇరువైపులా విద్యుతు దీపాలతో అలంకరించి, కాషాయ పతాకాలను ఏర్పాటు చేశారు. అటు మద్దూర్‌నగర్‌ వరకు, ఇటు కలెక్టరేట్‌ వరకు మైక్‌ల ద్వారా ఘాట్‌ వద్ద జరుగుతున్న కార్యక్రమాలను ప్రసారం చేశారు. వినాయక మందిరం నుంచి శివపార్వతుల రథోత్సవం వినాయక ఘాట్‌ వరకు చేరుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సాయంత్రం 5 గంటలకు జ్యోతి ప్రజ్వలన, 5.30 గంటలకు శివపార్వతుల అభిషేక పూజలు చేశారు. ధ్వజారోహణ , ఆకాశజ్యోతి, జ్యోతి ప్రజ్వలనతో లక్ష దీపోత్సవాలు ప్రారం భించారు. దీపోత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఇ. పద్మావతమ్మ, జె. రాధిక, ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ కె. దేవకీదేవి, ఇతర ప్రతినిధులు జయలక్ష్మి, వరలక్ష్మి, స్వప్నసారధి, అనిత, హేమ, కమిటీ సలహాదారులు మల్లికార్జున రెడ్డి, మహేష్‌ పాల్గొన్నారు. పోలీసు అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఫ తుంగభద్ర నది ఒడ్డునగల హరిహర క్షేత్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో లక్ష దీపోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఆలయంలో జ్వాలా తోరణాన్ని నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సం డేల్‌ చంద్రశేఖర్‌ వెలిగించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు చల్లా నాగ రాజశర్మ, సీహెచ దుర్గాప్రసాద్‌, ఆనందరావు, శ్యామసుందర్‌రావు, టీవీ రవిచంద్రశర్మ, శ్రీనివాసరాజు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

ఫ నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలోని భరతమాత ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించి, జ్వాలా తోరణం, దీపోత్సవం, సామూహిక మంగళహారతులు నిర్వహించారు. ధార్మిక సప్తాహ కార్యక్ర మంలో టీటీడీ ధర్మప్రచార పరిషత కార్యనిర్వాహకుడు డాక్టర్‌ మల్లు వెంకటరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లోని అభయాంజనేయ స్వామి, ద్వారకామాయి ఆలయంలో దీపోత్సవాలు చేపట్టారు.

ఫలలితా పీఠంలో కార్తీక పౌర్ణమిని సందర్భంగా సామూహిక సత్యనా రాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. జ్వాలాతోరణం, భక్తులకు అల్పా హార ప్రసాదం పంపిణీ చేశారు. లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం స్వామి దంపతులను భక్తులు ఘనంగా సత్కరించారు.

ఫ నెహ్రూనగర్‌లోని సత్యసాయి మందిరంలోని శివాలయంలో ఉద యం సావహిక పంచామృత కార్యక్రమాలు నిర్వహించారు. బిల్వార్చన, పుష్పార్చన, మహా మంగళ హారతి చేపట్టారు. అర్థనారీశ్వర మూర్తులకు పూజలు, లలితా, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. సాయంత్రం జ్వాలాతోరణం చేపట్టారు.

ఫ పాతనగరంలో షిరిడీ సాయిబాబా దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం సాయినాథునికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మహిళలతో సామూహిక దీపోత్సవాలు, సాయి రథోత్సవం కన్నుల పండువగా చేశారు. అనంతరం జ్వాలాతోరణం నిర్వహించారు. ఆలయ కమిటీ కార్యదర్శి ఎస్‌జీ మహాబలేష్‌, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

ఓర్వకల్లు: కార్తీక పౌర్ణమి సందర్భంగా మండలంలోని కాల్వబుగ్గ, కొమ్ముచెరువు, ఓర్వకల్లులోని జీవేశ్వరస్వామి, పూడిచెర్ల, నన్నూరు, ఉయ్యా లవాడ, లొద్దిపల్లె, కన్నమడకల తదితర గ్రామాల్లోని శివాలయాల్లో మహిళలు దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కాల్వబుగ్గ రామేశ్వరస్వామి ఆలయంలో మండల పొదు పులక్ష్మి ఐక్య సంఘం గౌరవ సలహాదారాలు విజయభారతి ఆధ్వర్యంలో పొదుపు మహిళలు కోటి దీపాలు వెలిగించారు.

Updated Date - Nov 25 , 2026 | 12:15 AM