వెన్నెముకను సరి చేశారు
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:48 AM
18 ఏళ్ల యువతికి ఎస్.ఆకారంలో వంగిన వెన్నెముకను కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు 30 స్ర్కూలతో శస్త్రచికిత్స చేశారు. శుక్రవారం ఆసుపత్రిలో వివరాలు వెల్లడించారు.
30 స్ర్కూలతో సంక్లిష్టమైన ఆపరేషన్
రాయలసీమలో మొదటి కేసు అంటున్న కిమ్స్ వైద్యులు
కర్నూలు హాస్పిటల్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): 18 ఏళ్ల యువతికి ఎస్.ఆకారంలో వంగిన వెన్నెముకను కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వైద్యులు 30 స్ర్కూలతో శస్త్రచికిత్స చేశారు. శుక్రవారం ఆసుపత్రిలో వివరాలు వెల్లడించారు. కల్లూరు మండలం వామసముద్రం గ్రామానికి చెందిన 18 ఏళ్ల చిన్నారి 2017 నుంచి తలనొప్పి వెన్నుముక వంకరతో బాధపడుతోంది. 2019లో తలవెనుక మెదడులో లోపానికి తిరుపతిలో శస్త్రచకిత్స చేశారు. తలనొప్పి తగ్గినా వెన్నుముక వంకర అలాగే కొనసాగింది. దీంతో డిసెంబరు 23న యువతిని తల్లిదండ్రులు విష్ణు, నిర్మల, కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌కు తీసుకుని వచ్చారు. స్పెయిన్ సర్జన్ డా.షేక్ మన్నన్, ఆర్థోపెడిక్ హెచ్‌వోడీ డా.కిరణ్ కుమార్ పరీక్షలు నిర్వహించారు. డిసెంబరు 2వ తేదీ స్పెయిన్ సర్జన్ డా.షేక్ మన్నన్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.కిరణ్ కుమార్ అనస్థీషియా వైద్యులు డా.అత్తార్, డా.శృతి, క్రిటికల్ కేర్ డా.రాజేష్ రెడ్డి వైద్యబృంధం 5.30 గంటలు శ్రమించి న్యూవస్ ఇంట్రా ఆపరేటివ్ న్యూకోమానిటరింగ్ కింద 30 స్ర్కూలను ఉపయోగించి వంగిన వెన్నుముకను సరి చేశారు. దీంతో యువతి సాధారణ స్థితికి చేరుకుని, మొదటి రోజు నుంచే సొంతంగా సులభంగా నడవగలిగింది. స్పెయిన్ సర్జన్ డా.షేక్ మన్నన్ మాట్లాడుతూ క్లిష్టమైన ఆపరేషన్‌ను ఎన్టీఆర్ వైద్యసేవ కింద విజయవంతంగా నిర్వహించామన్నారు. కిమ్స్ సీఈవో సిద్దారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆపరేషన్ రాయలసీమలో మొట్టమొదటిదని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.15 లక్షలు అవుతుందని, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ డైరెక్టర్ పీడియాట్రిషన్ డా.గోవర్దన్ రెడ్డి పాల్గొన్నారు.