వెట్టిచాకిరి వ్యవస్థను నిర్మూలించాలి
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:36 PM
వెట్టిచాకిరి దురాచా రాన్ని రూపుమాపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
కర్నూలు లీగల్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): వెట్టిచాకిరి దురాచా రాన్ని రూపుమాపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు. వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన దినం సందర్బంగా జిల్లా న్యాయ సేవాసదన్ భవనంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరితోనైనా వెట్టిచాకిరి చేయించుకుంటే వారికి వెట్టి చాకిరి నిరోధక చట్టం కింద 3 సంవత్సరాల కఠిన కారా గార శిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తారని తెలిపారు. వెట్టి చాకిరి వ్యవ స్థపై ప్రజలందరూ పోరాడాలని ఆయన సూచించారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని 23 వ అధికరణం ఈ వ్యవస్థను నిషేధించిందని తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వెట్టిచాకిరి వ్యవస్థకు వ్యతిరే కంగా ఈ నెల 9వ తేదీ నుంచి వారం రోజుల పాటు కర్నూలు జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వెట్టిచాకిరి నిర్మూలన దినం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా న్యాయ సేవా సదన్ భవనం నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్డ్స్ సిబ్బంది, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, కార్మిక శాఖ, ఎన్జీవో మౌనిక తదితరులు పాల్గొన్నారు.