షిరిడీ ఆలయ వజ్రోత్సవాలు నిర్వహించాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:58 PM
దక్షిణ షిరిడిగా ప్రసి ద్ధి చెందిన పాతనగరంలో ఉన్న షిరిడీ సాయిబాబా దేవస్థానంలో 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి అన్నారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి
కర్నూలు కల్చరల్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): దక్షిణ షిరిడిగా ప్రసి ద్ధి చెందిన పాతనగరంలో ఉన్న షిరిడీ సాయిబాబా దేవస్థానంలో 75 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ధి అన్నారు. ఆదివారం ఆయన దేవస్థానాన్ని సంద ర్శించి పూజలు నిర్వహించారు. దేవస్థానం నిర్మించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా, దేవస్థానంలో పునః నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం నూతనంగా వాటర్ ప్లాంట్, జనరే టర్ రూమ్, పవర్ హౌస్, మినరల్ వాటర్ ప్లాంటు, స్టోర్ రూమ్, లడ్డూ కౌంటర్, టెంకాయల కౌంటర్లను ఆయన ప్రారంభించారు. ఈసందర్భం గా దేవస్థానంలో అభివృద్ధి పనులకు సహకరించిన దాతలను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు మురళీ మనోహర్, ప్రధాన కార్యదర్శి మహాబలేష్ పాల్గొన్నారు.