Share News

ట్రాఫిక్‌ పోలీసుల సేవలు అభినందనీయం

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:03 AM

ఎండలు సైతం లెక్క చేయకుండా అంకితభావంతో పని చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల సేవలు అభినందనీయమని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు.

ట్రాఫిక్‌ పోలీసుల సేవలు అభినందనీయం
ట్రాఫిక్‌ పోలీసులకు సమ్మర్‌ కిట్‌ బ్యాగులను పంపిణీ చేస్తున్న ఎస్పీ

ఎస్పీ విక్రాంత పాటిల్‌

కర్నూలు క్రైం, జూన 6(ఆంధ్రజ్యోతి): ఎండలు సైతం లెక్క చేయకుండా అంకితభావంతో పని చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల సేవలు అభినందనీయమని ఎస్పీ విక్రాంత పాటిల్‌ అన్నారు. శనివారం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషనలో వేసవి కాలంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం టోపీలు, స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌, ఎలక్ర్టాల్‌ బాక్స్‌లు మాస్కులు, కళ్లద్దాలు తదితర వస్తువులతో కూడిన సమ్మర్‌ కిట్‌ బ్యాగులను ఆయన పంపిణీ చేశారు. అలాగే ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన ఆవరణంలో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషనలో పునర్నిర్మాణం చేసిన గదులను ప్రారంభించారు. అలాగే ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషనలో విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందిన హోంగార్డు కృష్ణ కుటుంబానికి, పోలీసు సిబ్బంది తరుపున సేకరించిన రూ.50,800 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఎండలను లెక్కచేయకుండా విదులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం డీపీజీ చీఫ్‌ కార్యాలయం నుంచి వచ్చిన రూ.1,90,500 విలువైన సమ్మర్‌ కిట్‌ బ్యాగు లను నగరంలోని ట్రాఫిక్‌ పోలీసులతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు ట్రాఫిక్‌ పోలీసు విభాగాల్లో పని చేస్తున్న మొత్తం 127 మంది సిబ్బందికి అందజేశామని చెప్పారు. అదనపు ఎస్పీ జే.బాబు ప్రసాద్‌, ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన, స్పెషల్‌ బ్రాంచ సీఐ మధుసూదనరావు, టూటౌన సీఐ శ్రీధర్‌, సీసీఎస్‌ సీఐ రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2026 | 12:04 AM