Share News

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సేవలు అభినందనీయం

ABN , Publish Date - May 25 , 2026 | 12:36 AM

వ్యాపారుల సమస్యల పరిష్కారానికి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు.

చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సేవలు అభినందనీయం
మాట్లాడుతున్న టీజీ వెంకటేశ

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ

కర్నూలు ఎడ్యుకేషన్‌, మే 24(ఆంధ్రజ్యోతి): వ్యాపారుల సమస్యల పరిష్కారానికి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చేస్తున్న కృషి అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ అన్నారు. ఆదివారం స్థానిక టీజీ వెంకటేశ జిల్లా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 1974 నుంచి జిల్లా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో తనకున్న అనుబంఽధాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమం త్రిగా నందమూరి తారకరామారావు ఉన్న సమయంలో వస్త్రాలపై వచ్చిన ఎంట్రీ ట్యాక్స్‌కు వ్యతిరేకంగా పోరాడామన్నారు. రాష్ట్ర మంత్రివర్గసమ యం లో కూడా వ్యాపారులకు ఇబ్బందికరంగా మారిన వ్యాట్‌కు వ్యతిరేకంగా పోరాడామన్నారు. కర్నూలు నగరంలో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు సం బంధించి సమస్య వచ్చినప్పుడు మంత్రి టీజీ భరత స్పందించి మున్సిపల్‌ షాపులకు ప్రతి సంవత్సరం ఏడు శాతం ఆదాయం పెంచే విధంగా చూశా రన్నారు. సంస్థ అధ్యక్షుడు విజయకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లా చాం బర్‌ ఆఫ్‌ కామర్స్‌ అభివృద్ధికి టీజీ వెంకటేష్‌ అందిస్తున్న సహకారం మరువ లేనిదన్నారు. కార్యక్రమంలో గౌరవ కార్యదర్శి రత్నప్రసాద్‌, కార్యదర్శి నరేం ద్ర, ఆర్యవైశ్యమహా సభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 12:36 AM