Share News

పొట్టి శ్రీరాములు సేవలను మర్చిపోరాదు

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:24 PM

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను, సేవలను మరువరాదని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

పొట్టి శ్రీరాములు సేవలను మర్చిపోరాదు
పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను, సేవలను మరువరాదని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం బనగానపల్లె పట్టణం పాతబస్టాండ్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, గాథంశెట్టి వేణుగోపాల్‌, శ్రీరామ వెంకట సుబ్రమణ్యం తదితరులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు. మంత్రి బీసీ మాట్లాడుతూ ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో తెలుగువారికి ఏమాత్రం గౌరవం లేని పరిస్థితుల్లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణ త్యాగం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ శాశ్వత అధ్యక్షుడు పీఎస్‌ఎస్‌ నారాయణ, పారిశ్రామికవేత్త గాలి మద్దిలేటిరెడ్డి, జక్కా శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 11:24 PM