మహనీయుల త్యాగాలు మరువలేనివి
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:23 PM
మహనీయుల త్యాగాలు మరువలేనివి అని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల క్రైం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): మహనీయుల త్యాగాలు మరువలేనివి అని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసి ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేశారు. వేడుకల్లో జిల్లా ఎస్పీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్, సురేష్‌బాబు, ఆర్‌ఎస్‌ఐ కాళీచరణ్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.