Share News

నామినేషన్ల జోరు

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:55 PM

పల్లె పోరులో తొలి ఘట్టం ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు.

నామినేషన్ల జోరు
ఆరేకల్‌లో నామినేషన్‌ దాఖలు చేస్తున్న టీడీపీ మద్దతుదారు ధనలక్ష్మి

తొలి విడతలో 148 పంచాయతీలకు ఎన్నికలు

సర్పంచులకు 223, వార్డు సభ్యులకు 237 నామినేషన్లు

అత్యధికంగా ఆస్పరి.. అత్యల్పంగా హాలహర్వి మండలంలో..

నేడు రెండో విడత పల్లె పోరుకు నోటిఫికేషన్‌ జారీ

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

పోలీసుల భారీ బందోబస్తు

పల్లె పోరులో తొలి ఘట్టం ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. తొలి విడతలో ఆదోని, పత్తికొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 148 గ్రామ పం చాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఆదివారం రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. పోరకు సై అంటున్న అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు 58 క్లస్టర్ల పరిధిలో సర్పంచి పదవులకు 223, ఆయా పంచాయతీల్లో వార్డు మెంబరు పదవులకు 237మంది ప్రధాన పార్టీల మద్దతు దారులు, పలువురు స్వతంత్రులు రంగంలోకి దిగడంతో పల్లెపోరు మరింత ఆసక్తికరంగా మారింది.

కర్నూలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్రా పునేఠా ఇప్పటికే షెడ్యూల విడుదల చేశారు. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ.సిరి ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధం చేశారు. జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే ఆదోని, ఆలూరు నియోజవకవర్గాల పరిధిలోని 148 గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు 58 క్లస్టర్ల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌వో) నోటిఫికేషన్‌ జారీ చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. రేపటితో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముగిస్తే.. సోమవారం రెండో విడత ఎన్నికలు జరిగే 186 పంచాయతీల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్‌ జారీ చేయనుంది.

ఎనిమిది మండలాల్లో..

ఎనిమిది మండలాల్లో సర్పంచ్‌ పదవులకు 223 మంది అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను ఆర్‌వోలకు అందజేశారు. వార్డుల సభ్యుల పదవులకు మేము సైతం అంటూ 237 మంది నామినేషన్లు దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఏ.సిరి దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాల, కుంకనూరు ‘స్వర్ణ గ్రామం’ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. కనీస సౌర్యాల లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసూ.. అభ్యర్థులు, వారికి ప్రాదిపాదకుడిగా వచ్చిన వాళ్లు కూర్చోవడానికి కుర్చీలు, నీడ కోసం షామియానాలు, తాగునీరు, మెడికల్‌ కిట్లు ఏర్పాటుచేయాలని పత్తికొండ ఆర్డీవో ఓబులేశ్‌, దేవనకొండ ఎంపీడీవో జ్యోతి, తహసీల్దారు నాగేశ్వర్‌రెడ్డిలను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

తొలి రోజున ఆస్పరి మండలంలో..

తొలి రోజున ఆస్పరి మండలంలో 21 పంచాయతీల సర్పంచ్‌ పదవులకు అత్యధికంగా 44 నామినేషన్లు దాఖలు కాగా, అత్యల్పంగా హాలహర్వి మండలంలో 15 పంచాయతీలకు కేవలం 8 నామినేషన్లే వచ్చాయి. ఆదోని-1, ఆదోని-2, హోళగుంద మండలాల నుంచి 30 నుంచి 40 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సోమవారం మంచి ముహుర్తం ఉండడంతో భారీగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మండలాల వారీగా దాఖలైన నామినేషన్లు

మండలం క్లస్టర్లు పంచాయతీలు సర్పంచ్‌ వార్డు సభ్యులు

ఆదోని-1 8 21 30 58

ఆదోని-2 9 19 40 36

హోళగుంద 6 17 34 25

ఆలూరు 8 16 17 27

ఆస్పరి 7 21 44 26

చిప్పగిరి 5 13 19 12

దేవనకొండ 10 26 31 46

హాలహర్వి 5 15 8 7

మొత్తం 58 148 223 237

Updated Date - Nov 15 , 2026 | 11:55 PM