ఎలకి్ట్రక్ బస్సులను ఆర్టీసీయే కొనాలి
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:27 AM
ఎలకి్ట్రక్ బస్సులను ఆర్టీసీ సంస్థనే కొనుగోలు చేయాలని ఆర్టీసీ జాయింట్ యాక్షన కమిటీ సభ్యులు సి.మద్దిలేటి, ఏవీ రెడ్డి, శేఖర్, ఎనఆర్ నాయుడు, పీఎండీ ఇస్మాయిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెండోరోజూ కొనసాగిన ధర్నా
కర్నూలు(రూరల్), జూన 24(ఆంధ్రజ్యోతి): ఎలకి్ట్రక్ బస్సులను ఆర్టీసీ సంస్థనే కొనుగోలు చేయాలని ఆర్టీసీ జాయింట్ యాక్షన కమిటీ సభ్యులు సి.మద్దిలేటి, ఏవీ రెడ్డి, శేఖర్, ఎనఆర్ నాయుడు, పీఎండీ ఇస్మాయిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు 1, 2 డిపోల ఎదుట ఆర్టీసీ ఎనఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయ కులు కలిసి జేఏసీ అధ్వర్యంలో బుధవారం రెండో రోజు కూడా ఉద్యో గులు ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. ఈకార్యక్రమానికి డిపో జేఏసీ నాయకులు జి. మహేశ్వరరావు, ఎస్‌ఎండీ ఇసాక్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎలకి్ట్రక్ బస్సులను పినాకిల్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించే విధానాన్ని తీవ్రంగా వ్యతి రేకిస్తున్నట్లు చెప్పారు. కార్మికులకు పాత పద్ధతిలోనే వైద్య విధానం కొనసాగించాలన్నారు. సిబ్బంది కొరత పేరుతో డ్రైవర్, కండక్టర్‌లకు సెలవులు ఇవ్వకుండా వేధింపులు మానుకోవాలని, పెండింగ్‌లో ఉన్న నైట్ డ్యూటీ అలవెన్సులను ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో జేఏసీ నాయకులు ఆర్‌వీఎం రావు, కృష్ణ, వీరేష్, తిమ్మప్ప, నాగరాజు, గౌడ్ తదితరులు పాల్గొన్నారు.