Share News

ఎలకి్ట్రక్‌ బస్సులను ఆర్టీసీయే నడపాలి

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:38 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఎలకి్ట్రక్‌ బస్సులను ఏపీఎ్‌సఆర్టీసీయే నడపాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మాజీ రాష్ట్ర కోశాధికారి జె. దివాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎలకి్ట్రక్‌ బస్సులను ఆర్టీసీయే నడపాలి
రిలే నిరాహారదీక్షలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

కర్నూలు రూరల్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఎలకి్ట్రక్‌ బస్సులను ఏపీఎ్‌సఆర్టీసీయే నడపాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మాజీ రాష్ట్ర కోశాధికారి జె. దివాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నెల్లూరు-2 డిపో కార్మికులు చేస్తున్న పోరాటానికి కర్నూలు జిల్లా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సంఘీభావంగా మంగళవారం కొత్తబస్టాండ్‌ ఆవరణలో రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈకార్యక్రమానికి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మాజీ రాష్ట్ర కోశాధికారి జె.దివాకర్‌ మాట్లాడుతూ ఎలకి్ట్రక్‌ బస్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజా రవాణా సంస్థను ప్రైవేటీకరించడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాం డ్‌ చేశారు. ఏపీ ఆటో యూనియన రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌, సీఐటీ యూ న్యూసిటీ అధ్యక్షుడు నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 11:38 PM