వృద్ధుల హక్కులను కాపాడాలి
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:57 PM
వృద్ధులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని, వాటిని కాపాడటం అందరి బాధ్యత అని జిల్లా న్యాయాఽధికారి కబర్ధి అన్నారు.
జిల్లా న్యాయాధికారి కబర్ధి
నందికొట్కూరు, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): వృద్ధులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని, వాటిని కాపాడటం అందరి బాధ్యత అని జిల్లా న్యాయాఽధికారి కబర్ధి అన్నారు. మంగళవారం సీనియర్ సిటిజన్లకు న్యాయసేవలపై పట్టణం శివారులోని శ్రీ కాళీ ప్రసాద ఆశ్రమంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వృద్ధులు తమ హక్కులను, రక్షణలను 2016 పథకం ద్వారా పొందవచ్చని అన్నారు. పిల్లలచే నిర్లక్ష్యానికి గురైన లేదా సంరక్షణకు దూరమైన వృద్ధులు తమ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత రెవిన్యూ డివిజనల్ అధికారిని సంప్రదించి పరిష్కారం పొందవచ్చని వివరించారు. జిల్లా న్యాయ సేవా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ వృద్ధులు న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ న్యాయ సేవల హెల్ప్‌లైన్ నెం: 15100ను సంప్రదింవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళీ ప్రసాద ఆశ్రమం గౌరవాధ్యక్షుడు మోహన్‌రావు, నందికొట్కూరు సీనియర్ సివిల్ న్యాయాధికారి శోభారాణి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దివ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.