బీఈడీ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:03 AM
ఎనస్‌టీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన) నిబంధనలు పాటించకుం డా నిర్వహిస్తున్న బీఈడీ కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఏ, పీడీ ఎస్‌యూ, ఆర్‌ఫీఎస్‌ఎఫ్ ఆధ్వ ర్యంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ ఏ.సిరికి వినతి పత్రం అందజేశారు.
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఎనస్‌టీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన) నిబంధనలు పాటించకుం డా నిర్వహిస్తున్న బీఈడీ కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఏ, పీడీ ఎస్‌యూ, ఆర్‌ఫీఎస్‌ఎఫ్ ఆధ్వ ర్యంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ ఏ.సిరికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఏఐఎస్‌ఏ రాష్ట్ర కార్యదర్శి నాగర్జున, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు రమణ కుమార్, ఆర్‌ఫీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజులు మాట్లాడుతూ దాదాపు 15 నుంచి 18 బీఈడీ కళాశాలల్లో కనీస స్థాయి భవనాలు కూడా లేవని, అనేక కళాశాలల్లో, తర గతులు, ల్యాబ్‌లు, ప్రాక్టికల్స్, బ్లాక్ టీచింగ్ సక్రమంగా నిర్వహిం చడం లేదని అన్నారు. కార్యక్రమంలో సాయి పవన, శివ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.