Share News

రోగులకు అసలైన ‘పరీక్ష’

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:58 PM

వాతావరణంలో మార్పు నేపథ్యంలో వైరల్‌ జ్వరాలు దగ్గు, జలుబు లక్షణాలతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆశ్రయించే రోగుల సంఖ్య పెరిగింది.

రోగులకు అసలైన ‘పరీక్ష’
అల్ర్టాసౌండ్‌ స్కానింగ్‌ టోకెన కోసం అవస్థలు పడుతున్న రోగులు

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పు నేపథ్యంలో వైరల్‌ జ్వరాలు దగ్గు, జలుబు లక్షణాలతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆశ్రయించే రోగుల సంఖ్య పెరిగింది. న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో పరీక్షల రిపోర్టుల కోసం రోగులు ఓ వైపు సిని మా టికెట్ల కోసం అవస్థలు పడుతుండగా.. మరోవైపు అల్ర్టాసౌండ్‌ స్కా నింగ్‌ టోకెన్ల కోసం మధ్యాహ్నం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కా నింగ్‌ కోసం వచ్చే రోగుల కోసం అదనంగా టోకెన్ల సంఖ్యను పెంచాలని వారు కోరుతున్నారు. మరో పక్క నిర్ధారణ పరీక్షల రిపోర్టుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నామని, మధ్యాహ్నం 3 గంటల తర్వాత రిపోర్టులు ఇవ్వడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే తాము ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 18 , 2026 | 11:58 PM