హైకోర్టు బెంచ ప్రక్రియను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:58 PM
కర్నూలులో హైకోర్టు బెంచ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ లాయర్స్ ఫోరం అధ్యక్షుడు, సీనియర్ హైకోర్టు న్యాయవాది వై.జయరాజు అన్నారు.
కర్నూలు లీగల్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ లాయర్స్ ఫోరం అధ్యక్షుడు, సీనియర్ హైకోర్టు న్యాయవాది వై.జయరాజు అన్నారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షను ఆయన సందర్శిం చారు. ఆయన మాట్లాడుతూ హైకోర్టు బెంచను కర్నూలు ఏర్పాటు చేయాలని ఆయన సీఎం చంద్రబాబు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఓ విజ్ఞాపన పత్రంలో కోరినట్లు తెలిపారు.
18వ రోజుకు చేరుకున్న దీక్షలు: హైకోర్టు బెంచ కోసం న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు గురువారానికి 18వ రోజుకు చేరాయి. దీక్షలో కూర్చున్న వారిలో న్యాయవాదులు సయ్య ద్ షబానా, సమీనా షాహీన, వసుంధరాదేవి బి.జ్యోతిరాణి, ఏ.రేవ తిరెడ్డి, టి.ప్రమీలారాణి, వెంకటేశ్వర్లు, శ్రావణ్ కుమార్, నరసిం హారాజు, చెన్నకేశవరెడ్డి ఉన్నారు.