అహింసా సిద్ధాంతం అందరికీ ఆదర్శప్రాయం
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:13 AM
జైనులు ఆచరించే అహింసా సిద్ధాంతం అందరికీ ఆదర్శప్రాయమని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ అన్నారు.
మాజీ ఎంపీ టీజీ వెంకటేశ
కర్నూలు కల్చరల్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జైనులు ఆచరించే అహింసా సిద్ధాంతం అందరికీ ఆదర్శప్రాయమని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ అన్నారు. బుధవారం పాతనగరంలోని జైనుల మందిరం వ ద్ద ఏర్పాటుచేసిన జైనుల ర్యాలీ కార్యక్రమాన్ని ఆయన ఊపి ప్రారంభించారు. జైన సామాజిక వర్గానికి చెందిన 85 మంది భక్తులు 84 రోజుల పాటూ చాతుర్మాస దీక్షలు పాటించి దీక్షల ముగింపు సందర్భంగా ఈర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేశ హాజరయ్యారు. అంతకు ముందు నగరంలోని జైనులు టీజీ వెంకటేశకు సంప్రదాయ మేళతాళాలతో వేదిక వద్దకు స్వాగతం పలికారు. జైనుల సంప్రదాయ తలపాగాను ఆయనకు అలంకరించారు. జైనుల మత గురువులతోపాటూ జైన సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పాల్గొన్నారు. టీజీ వెంకటేశ మాట్లాడుతూ జైన సామాజిక వర్గానికి చెందిన వారు చాతుర్మాస దీక్షలు ఆచరించి, ఉపవాసాలు పాటించడం అభినందనీయమన్నారు.