Share News

ధరల పెంపును ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - May 16 , 2026 | 11:43 PM

పెట్రోల్‌, డీజిల్‌పై పెం చిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.మునెప్ప డిమాండ్‌ చేశారు.

ధరల పెంపును ఉపసంహరించుకోవాలి
మాట్లాడుతున్న సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.మునెప్ప

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కర్నూలు న్యూసిటీ, మే 16(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌పై పెం చిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.మునెప్ప డిమాండ్‌ చేశారు. ధరల పెంపును నిరసిస్తూ శనివారం సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు భీసన్న అధ్యక్షతన కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. మునెప్ప మాట్లాడుతూ దేశంలో అందరికీ సరిపడే చమురు నిల్వలున్నాయని నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల పూర్తయిన వెంటనే చమురు ధరలు పెంచడం దారుణ మన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం పడకుండా ఉండాలంటే ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమి స్తామని హెచ్చరించారు. నగర కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి, సమయ కార్యదర్శి సి.మ హేష్‌, జిల్లా కార్యవర్గసభ్యులు జి.చంద్రశేఖర్‌, శ్రీనివాసులు, గిడ్డమ్మ, భద్రకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 11:43 PM