Share News

పీఆర్సీని అమలు చేయాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:27 PM

ప్రభుత్వ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు హృదయరాజు, సురేశ్‌కుమార్‌, ఫ్యాప్టో ఛైర్మన్‌ రామచంద్రారెడ్డి, సెక్రటరీ జనరల్‌ దస్తగిరి డిమాండ్‌ చేశారు.

పీఆర్సీని అమలు చేయాలి
కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న ఫ్యాప్టో సభ్యులు, తదితరులు

నంద్యాల నూనెపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు హృదయరాజు, సురేశ్‌కుమార్‌, ఫ్యాప్టో ఛైర్మన్‌ రామచంద్రారెడ్డి, సెక్రటరీ జనరల్‌ దస్తగిరి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం నంద్యాల శ్రీనివాసనగర్‌ నుంచి బైక్‌ ర్యాలీగా కలెక్టరేట్‌ వరకు వెళ్లి అక్కడ ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు డీఏలను, పాత డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాల నన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహా యింపు ఇవ్వాలని, 23(1)కు పార్లమెంట్‌లో సవరణ చేసి టెట్‌ రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని అన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పీవీ వరప్రసాద్‌, చంద్రశేఖర్‌, శ్రీనివాసులు, కిరణ్‌కుమార్‌రెడ్డి, స్వామి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:27 PM