Share News

పోలీసు అధికారిని సస్పెండ్‌ చేయాలి

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:15 AM

పత్తికొండలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయ కులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అరెస్టుచేసి అక్ర మంగా బైండోవర్‌ కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని సస్పెండ్‌ చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

పోలీసు అధికారిని సస్పెండ్‌ చేయాలి
ధర్నా చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): పత్తికొండలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయ కులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అరెస్టుచేసి అక్ర మంగా బైండోవర్‌ కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని సస్పెండ్‌ చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా యూనియన్ల నాయ కులు కే. శ్రీనివాసులు, బీసన్న, అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పత్తికొండ నియోజకవర్గానికి కేటాయించిన గురుకుల పాఠశాలను పత్తికొండలో ఏర్పాటు చేయకుండా కంబలపాడుకి తరలించడం తగదన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:15 AM