ఎమ్మెల్యేల పనితీరు పరువాలేదు..
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:46 PM
జిల్లాలో మంత్రి టీజీ భరత్ సహా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల పనితీరు పర్వాలేదు. ఇంకా మెరుగ్గా రాణించాలి.
సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
కర్నూలు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంత్రి టీజీ భరత్ సహా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల పనితీరు పర్వాలేదు. ఇంకా మెరుగ్గా రాణించాలి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పనులు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. పనితీరు మరింత మెరుగు పరుచుకోవాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం అమరావతిలో జిల్లా ప్రజాప్రతినిధులు, నియో జకవర్గ ఇన్‌చార్జిలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, గౌరు చరిత, బీవీ జయనాగేశ్వరరెడ్డి, డా.పార్థసా రధి, ఆలూరు, మంత్రాలయం ఇన్‌చార్జిలు వైకుంఠం జ్యోతి, మాధవరం రాఘవేంద్ర రెడ్డిలు హాజరయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనడం, నిత్యం ప్రజల్లో ఉండటం, మీడియా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పాల్గొనడం, నెలలో ప్రజల మద్య ఎన్నిరోజులు ఉంటారు.. వంటి అంశాలపై ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు షీల్డ్ కవర్ నివేధికలు అంద జేశారు. ప్రస్తుతానికి పనితీరు పర్వాలేదని, ఇంకా మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారికి సూచిం చారు. నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఎన్నికల్లో ప్రత్యామ్నా యం చూసుకోవాల్సిందంటూ సున్నితంగా హెచ్చరికలు జారీ చేసిన ట్లు తెలిసింది. ప్రజాప్రతినిధుల పనితీరుపై సీఎం చంద్ర బాబు ఇచ్చిన షీల్డ్ కవర్‌లలో తమ పనితీరును చూసుకుని కొందరు ఎమ్మెల్యేలు సంతోషపడితే.. ఆఖరి స్థానంలో ఉన్నవా రు లోలోన మదనపడినట్లు తెలుస్తుంది. మంత్రి టీజీ భరత్ పనితీరులో జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది.