వలస బాట
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:23 PM
: పశ్చిమ ప్రాంత గ్రామాలను కరువు వెంటాడుతోంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు కుటుంబాలతో సహా పొరుగు రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు.
రాయచూరుకు పయనమైన విరుపాపురం గ్రామస్థులు
ఉపాధి లేక ఊరు వదులుతున్న రైతు కూలీలు
ఆలూరు, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ప్రాంత గ్రామాలను కరువు వెంటాడుతోంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు కుటుంబాలతో సహా పొరుగు రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి మండలం విరుపాపురం గ్రామం నుంచి వందలాది మంది పొట్ట కూటి కోసం శుక్రవారం కర్ణాటకలోని రాయచూరుకు టిప్పర్‌లలో బయలుదేరి వెళ్లారు.పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో వలస సామగ్రి పట్టుకొని చదువుకు స్వస్తి చెబుతూ పిల్లలు బయలుదేరారు. స్థానికంగా పనులు లేకపోవడంతో కూలీలు వలసలు వెళ్తున్నారు.