న్యాయవాదులకు క్రీడా పోటీల నిర్వహణ భేష్
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:35 AM
ఒలింపిక్ ఉత్సవా లలో భాగంగా న్యాయవాదులకు షటిల్ బ్యాడ్మింటన, క్యారమ్స్, చెస్ వంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
కర్నూలు స్పోర్ట్స్, జూన 20 (ఆంధ్రజ్యోతి): ఒలింపిక్ ఉత్సవా లలో భాగంగా న్యాయవాదులకు షటిల్ బ్యాడ్మింటన, క్యారమ్స్, చెస్ వంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన షటిల్ బ్యాడ్మిం టన పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పోటీలను ప్రారం భించారు. ఈ నెల 28వ తేదీ ఒలింపిక్ అసోసియేషన నిర్వహకులు నిర్వహించే ఒలింపిక్ డే రనలో న్యాయవాదులు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. అనంతరం జిల్లా ఒలింపిక్ అసోసియే షన అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా బార్ అసోసియేషన అధ్యక్ష, కార్యదర్శులు చంద్రుడు, మహేశ్వరరెడ్డి, గేమ్స్ కార్యదర్శి ప్రభాకర్‌లు కలిసి క్యారమ్స్ పోటీలను ప్రారంభించారు. ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరుకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు.