పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:12 AM
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూని యన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన.బాలునాయక్ డిమాండ్ చేశారు.
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూని యన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన.బాలునాయక్ డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిపాలన విభాగం ఎదుట వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలి పారు. బాలునాయక్ మాట్లా డుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రబుత్వం అవలంభిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ దశల వారీ ఆందోళనలను నిర్వహిస్తున్నా మన్నారు. పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్ జీతం మంజూరు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ 11వ పీఆర్‌సీ స్కేల్ ప్రకారం వంద శాతం గ్రాస్ జీతం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన నాయకులు మల్లికార్జున సుందర్‌రాజు, నూర్ అహ్మద్, ఉరుకుందయ్య, బాలన్న, పరుశు రాముడు, సుశీలమ్మ, గీతా కళ్యాణి, జయలక్ష్మి, ఉద్యోగులు పాల్గొన్నారు.