కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:42 AM
అంగన్‌వాడీ లకు నెలకు కనీసం వేతనం రూ.26వేలు అందించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అంగన్‌వాడీలు
కోడుమూరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ లకు నెలకు కనీసం వేతనం రూ.26వేలు అందించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాల యం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో సీఐటీయూ జిల్లా నాయకులు గఫూర్‌మియా మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మరించా రన్నారు. నేటి నుంచి ఈనెల 27 వరకు రిలే నిరాహార దీక్షలు పూర్తి చేసి మార్చి 2న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో నాయ కులు వీరన్న, మోహన్, కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ మండలాల అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.