Share News

వైద్య వృత్తి పవిత్రమైనది

ABN , Publish Date - Sep 16 , 2026 | 12:29 AM

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ అన్నారు.

వైద్య వృత్తి పవిత్రమైనది
మాట్లాడుతున్న ప్రిన్సిపాల్‌ చిట్టినరసమ్మ

కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కే. చిట్టినరసమ్మ అన్నారు. 2026-27 విద్యాసంవత్సరం ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన కార్యక్రమం మంగ ళవారం న్యూలెక్చరర్‌ గ్యాలరీలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వైద్య వృత్తి జ్ఞానంతో పాటు మానవత్వం, సేవాభావం నైతిక విలువలు అత్యంత ముఖ్యమన్నారు. కర్నూలు మెడికల్‌ కాలేజీకి ఉన్న ఘన చరిత్ర వైద్యరంగంలో ఉన్న ప్రత్యేక గుర్తింపును నూతన విద్యార్థులు మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. స్టేట్‌ క్యాన్సర్‌ ఇనస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డా. సీఎస్‌ కృష్ణ ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 12:29 AM