స్థానికాలను కైవసం చేసుకోవాల్సిందే
ABN , Publish Date - Oct 03 , 2026 | 11:15 PM
రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వంద శాతం గెలిచి స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాల్సిందే అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
టీడీపీ కార్యాలయంలో సమన్వయ సమీక్ష
కర్నూలు అర్బన్ ,అక్టోబర్ 3(ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు వంద శాతం గెలిచి స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాల్సిందే అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ జిల్లా అఽఽధ్యక్షులు, ఎమ్మెల్యే శ్యాం బాబు, జోన్ -5 టీడీపీ కో ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఇందులో గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహం, క్షేత్ర స్థాయి కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పని చేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నిర్ణయించారు. గ్రామం నుంచి నగరం వరకు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వవన్ కళ్యాణ్ అండతో, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం ఎన్నడూ లేని విధంగా పురోగతి సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జిలు మీనాక్షి నాయుడు, రాఘవేంద్రరెడ్డి, వైకుంఠం జ్యోతి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణ, జనసేన జిల్లా అఽఽఽధ్యక్షుడు సురేష్ పాల్గొన్నారు.