Share News

చట్టబద్ధ దత్తత ప్రక్రియను అనుసరించాలి

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:27 PM

చట్టబద్ధమైన దత్తత ప్రక్రియను అనుసరించాలని డిసి్ట్రక్ట్‌ చైల్డ్‌ పొటెక్షన్‌ యూనిట్‌ (డీసీపీయూ) ఆఫీసర్‌ శారద అన్నారు.

చట్టబద్ధ దత్తత ప్రక్రియను అనుసరించాలి
మాట్లాడుతున్న డీసీపీయూ ఆఫీసర్‌ శారద

డీసీపీయూ ఆఫీసర్‌ శారద

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): చట్టబద్ధమైన దత్తత ప్రక్రియను అనుసరించాలని డిసి్ట్రక్ట్‌ చైల్డ్‌ పొటెక్షన్‌ యూనిట్‌ (డీసీపీయూ) ఆఫీసర్‌ శారద అన్నారు. సోమవారం జాతీయ దత్తత అవగాహన మాసోత్సవాల సందర్భంగా జగన్నాథ గట్టుపై ఉన్న పలు ప్రార్థనాలయాలు, గురుకుల పాఠశాలలో దత్తతపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. ఎవరైనా దత్తత తీసుకోవాలని భావించే వారు చట్టబద్ధమైన దత్తత విధానాన్నే అనుసరించాలని, ఈ పద్ధతి ఇరు పక్షాలకు అధికారికంగా, భద్రతపరంగా ఎంతో సురక్షితమైనదని అన్నారు. దత్తత ప్రక్రియపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని, దీనిని చట్టబద్ధంగా తీసుకుంటే ఎటువంటి అవాంతరాలు ఉండవని చెప్పారు. దత్తత విధానంలో పిల్లల హక్కులు, భధ్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యులు మాధవి, శిశుగృహ ఆఫీసర్‌ మెహతాజ్‌, ఎనఐసీ పీవో దీపరాణి, సామాజిక కార్యకర్త అరుణ, గురుకుల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2026 | 11:27 PM