పరిశోధన, కొత్త వంగడాల ఉత్పత్తికి భూములు అనుకూలం
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:41 AM
మండలంలోని తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రంలో వ్యవసాయ పరిశోధన, కొత్త వంగడా లను ఉత్పత్తి చేసేందుకు నల్లరేగడి భూములు అనుకూలంగా ఉన్నా యని ఆచార్యఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ పీవీ సత్యనారా యణ అన్నారు.
- ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం
వైస్ ఛాన్స్‌లర్ వెల్లడి
జూపాడుబంగ్లా, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రంలో వ్యవసాయ పరిశోధన, కొత్త వంగడా లను ఉత్పత్తి చేసేందుకు నల్లరేగడి భూములు అనుకూలంగా ఉన్నా యని ఆచార్యఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ పీవీ సత్యనారా యణ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన భూములను పరిశీలిం చారు. ఈ భూములకు వర్షధారంతో పాటు, అవసరమైన సమయంలో సాగునీటి సరఫరా ఎలా చేస్తారని వివరాలు తెలుసుకున్నారు. ఏఏ పంటలను సాగు చేస్తున్నారని క్షేత్రం ఏడీఏ అరుణలతను అడిగి తెలుసుకున్నారు. విలేకర్లతో మాట్లాడుతూ గతంలో 630 ఎకరాలు సీడ్‌హబ్‌కు కేటాయించారని, అందులో ఉన్న 250 ఎకరాలను వ్యవసాయ పరిశోధన కేంద్రంతోపాటు, కొత్తవంగడాలు ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. దీనికోసం మూడేళ్లపాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని చివరిదశకు చేరుకుందని త్వరలో సమావేశం జరగనుందని అందులో ప్రతిపాదనలు అమలయ్యేలా ఉందని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేస్తే ఇక్కడే బ్రీడర్‌సీడ్, ఫౌండేషన్ సీడ్స్ ఉత్పత్తిచేసి రైతులకు, సొసైటీలకు విత్తనాలను రాయితీతో అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ జయలక్ష్మీ, ఏవో అశోక్‌కుమార్‌రెడ్డి,శ్రావణీ,నిర్మల, తేజశ్వరీ పాల్గొన్నారు.