పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:23 AM
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నిర్మల
కర్నూలు న్యూసిటీ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల డిమాండ్ చేశారు. ఆదివారం పాతబస్తీ పొట్టిశ్రీరాములు కూడలిలో గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని కోరుతూ నగరకార్యదర్శి ఎం.రాజశేఖర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అమెరికా, ఇరాన్ యుద్ధం సాకు చూపి వంట గ్యాస్ ధరలు పెంచడం హేయమైన చర్య అన్నారు. గల్ప్ దేశాలపై చమురు కోసం తహతహలాడుతూ అన్ని దేశాలపై యుద్ధం చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి డి.గౌ్‌సదేశాయ్, నాయకులు ఎస్.ఏ.సుభాన్, ఎస్‌ఎండీ.షరీఫ్, అబ్దుల్‌దేశాయ్, రామక్రిష్ణ, రాంబాబు పాల్గొన్నారు