పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలి: సీపీఐ
ABN , Publish Date - May 04 , 2026 | 10:41 PM
పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ నాయకుడు మనోహర్‌మాణిక్యం డిమాండ్ చేశారు.
కర్నూలు న్యూసిటీ, మే 4(ఆంధ్రజ్యోతి): పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ నాయకుడు మనోహర్‌మాణిక్యం డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట సీపీఐ నగర సహాయ కార్యదర్శి సి. మహేష్ అధ్యక్షతన సోమవారం ధర్నా చేపట్టారు. మనోహర్‌మాణిక్యం మాట్లాడుతూ దేశ ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచబోమని, అది ప్రభుత్వమే భరిస్తుందని ప్రజలను నమ్మబలికి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.960 రూపాయలు పెంచడం దారుణమన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలనే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో నగర సహాయ కార్యదర్శి డి.శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు నాగరాజు, బీసన్న, అన్వర్, నల్లన్న, సురేష్, రాముడు తదితరులు పాల్గొన్నారు.