Share News

శ్రీగిరిలో కన్నడిగుల సందడి

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:38 PM

శ్రీగిరి కన్నడిగుల సందడి నెలకొంది. శ్రీశైల మహా క్షేత్రం కర్ణాటకను తలపిస్తోంది.

శ్రీగిరిలో కన్నడిగుల సందడి

శ్రీశైలం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): శ్రీగిరి కన్నడిగుల సందడి నెలకొంది. శ్రీశైల మహా క్షేత్రం కర్ణాటకను తలపిస్తోంది. వందల కిలోమీటర్ల దూర ప్రాంతాల నుంచి పాదయాత్రలుగా క్షేత్రానికి వస్తున్న వారికి దారిపోడవునా అన్నదానాలు, మంచినీరు, మజ్జిగ వంటివి అందిస్తున్న స్వచ్ఛంద సంఘాల సేవలు హర్షనీయమంటున్నారు. రోజుకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు, మిగతా సమయంలో అలంకార దర్శనం కల్పించేలా దర్శన విధానాలను అమలు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్పర్శ దర్శనానికి ఐదు గంటల సమయం, అలంకార దర్శనాలకు మూడు గంటల సమయం పడుతుందని మైక్‌ అనౌన్స్‌మెంట్‌ ద్వార కన్నడ భాషలో విస్తృతంగా ప్రచారం చెయిస్తున్నారు. క్యూలైన్లలో ఉండే భక్తులకు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అల్పాహారాలు, మంచినీరు, మజ్జిగ, పాలు, బిస్కెట్లు వంటివి శివసేవకల సహకారంతో అందిస్తున్నారు. కైలాసద్వారం, హఠకేశ్వరం తోపాటు దేవస్థానం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:38 PM